తెలంగాణ

telangana

ETV Bharat / state

పిడుగుపాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం - Government compensation to families affected by lightning shock in telangana

పిడుగు పాటు వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు 6 లక్షల చొప్పున పరిహారాన్ని రాష్ట్ర సర్కారు మంజూరు చేసింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Government compensation to families affected by lightning shock in telangana
పిడుగుపాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం

By

Published : Nov 10, 2020, 3:33 PM IST

పిడుగుపాటు వల్ల మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి ఆరు లక్షల రూపాయల పరిహారాన్ని మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 39 మంది పిడుగుపాటు కారణంగా మృతి చెందారు.

ఒక్కో బాధిత కుటుంబానికి ఆరు లక్షల చొప్పున 2 కోట్ల 34 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చూడండి: దేశంలోనే మోడల్​ ప్లాంట్​గా జవహర్​నగర్​ 'వేస్ట్​ టు ఎనర్జీ'

ABOUT THE AUTHOR

...view details