పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి, అదనపు డీజీ జితేందర్, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు సచివాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్‌ను కలిశారు.
పోలీసుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: సీఎస్
పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పోలీసులు కీలక బాధ్యతలు పోషిస్తున్నారని సీఎస్ పేర్కొన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వపరంగా చర్యలు: సీఎస్ సోమేశ్
పోలీసు సిబ్బందికి సంబంధించిన అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పోలీసు సిబ్బంది కీలకమైన బాధ్యతను పోషిస్తున్నారని సీఎస్ పేర్కొన్నారు. పోలీస్ అధికారుల సంఘం నివేదించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
- ఇదీ చూడండి:ఎలాన్ మస్క్ రూ.730 కోట్ల బహుమతి- ఎవరికంటే?