తెలంగాణ

telangana

ETV Bharat / state

సీపీఐ మావోయిస్టు, అనుబంధ సంస్థలపై నిషేధం పొడిగింపు

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సీపీఐ మావోయిస్టు, అనుబంధ సంస్థలపై నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2005 ఆగస్టు 17వ తేదీ నుంచి నిషేధం కొనసాగుతోంది. ఈ ఏడాది ఆగస్టు మూడో వారంలో విధించిన నిషేధం... ఏడాది పాటు కొనసాగనుంది.

government ban on cpi maoist one year
సీపీఐ మావోయిస్టు, అనుబంధ సంస్థలపై నిషేధం పొడిగింపు

By

Published : Oct 31, 2020, 2:00 PM IST

సీపీఐ మావోయిస్టు, దాని అనుబంధ సంస్థలపై నిషేధాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఈ సంస్ధలపై నిషేధం విధించింది. ఈ ఏడాది ఆగస్టు మూడో వారంలో విధించిన నిషేధం... ఏడాది పాటు కొనసాగనుంది. సీపీఐ మావోయిస్టు, దాని అనుబంధ సంస్థలపై 2005 ఆగస్టు 17వ తేదీ నుంచి నిషేధం కొనసాగుతూ వస్తోంది.

సీపీఐ మావోయిస్టు, రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్, ఆల్ ఇండియా రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్, విప్లవ కార్మిక సమాఖ్య, సింగరేణి కార్మిక సమాఖ్యలపై నిషేధం విధించింది. రైతు కూలీ సంఘం, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, రాడికల్ యూత్ లీగ్​లపై ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తూ సాధారణ పరిపాలన శాఖ గెజిట్ రూపొందించింది.

ఇదీ చదవండి:దుబ్బాక ఉపఎన్నికలో వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌

ABOUT THE AUTHOR

...view details