తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. ఎన్ని పోస్టులున్నాయంటే? - ఏపీ బ్రేకింగ్​ న్యూస్​

APPROVES FOR POLICE JOBS IN AP: ఏపీలోని పోలీసు ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌. పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. 6,511 పోలీసు నియామకాలకు సీఎం జగన్ అంగీకారం తెలుపుతూ.. నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

POLICE JOBS
POLICE JOBS

By

Published : Oct 20, 2022, 9:11 PM IST

APPROVES FOR POLICE JOBS IN AP: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పోలీసు ఉద్యోగాల నియామకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. పోలీసు శాఖలో 6511 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. సివిల్‌ కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ, రిజర్వు కానిస్టేబుళ్లు, రిజర్వు ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుళ్లు, 3,580 సివిల్ కానిస్టేబుళ్లు, 315 సివిల్ ఎస్‌ఐ , 96 రిజర్వ్‌ ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details