తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ డిస్కంల ప్రత్యేక రుణానికి ప్రభుత్వ అనుమతి - విద్యుత్​ డిస్కంల రుణానికి అనుమతిచ్చిన ప్రభుత్వం వార్తలు

కరోనా నేపథ్యంలో విద్యుత్​ డిస్కంల ప్రత్యేక రుణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రెండు కార్పొరేషన్ల నుంచి రూ.12600 కోట్ల రుణానికి పూచీకత్తు ఇవ్వనుంది. ఈ మేరకు ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Government approval for special loan of discoms
విద్యుత్​ డిస్కంల ప్రత్యేక రుణానికి ప్రభుత్వ అనుమతి

By

Published : Jul 5, 2020, 9:50 AM IST

కొవిడ్-19 నేపథ్యంలో విద్యుత్ డిస్కంలపై ఆర్థిక భారం పడకుండా ప్రత్యేక రుణాలు తీసుకోనున్నాయి. ఈ మేరకు ఉత్తర, దక్షిణ డిస్కంలకు రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.

కరోనా వల్ల డిస్కంలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రుణాన్ని ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి రూ. 12,600 కోట్ల రుణం తీసుకునేందుకు రెండు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రత్యేక రుణం తీసుకునేందుకు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వనుంది. ఈ మేరకు ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీచూడండి: రోగనిరోధకశక్తిని పెంచుకోవాలంటే మునగాకు తినాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details