కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులకు ఇబ్బందులు పడుతున్న పేద అర్చకులు, పురోహితులకు ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి సాయం చేశారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్లో మైటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నందపాండే జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పేద పురోహితులకు ప్రభుత్వ సలహాదారు సాయం - పేద పురోహితులకు ప్రభుత్వ సలహాదారు సాయం
హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్లో మైటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నందపాండే జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పాల్గొన్నారు. కరోనా కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న వందమంది పేద అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణులకు కూరగాయాలు, పండ్లు, బియ్యం, వంటనూనె సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు.

పేద పురోహితులకు ప్రభుత్వ సలహాదారు సాయం
లాక్ డౌన్ కాలంలో వేలమంది పేదలకు నిరంతరం సహాయం చేస్తున్న నందపాండేను రమణాచారి అభినందించారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్న వారు పేదలకు సాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కరోనా కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న వందమంది పేద అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణులకు కూరగాయాలు, పండ్లు, బియ్యం, వంటనూనె సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చదవండి: దిల్లీలో కార్యాలయం కోసం తెరాసకు భూమిని అప్పగించిన కేంద్రం