Government Action on Praja Palana Application MisUse: ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న అధికారులు, సిబ్బందిపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హయత్ నగర్ డివిజన్‌కు సంబంధించిన దరఖాస్తులను డాటా ఎంట్రీకి తీసుకెళ్లే క్రమంలో పర్యవేక్షణ లోపించిన అధికారిపై కమిషనర్ వేటు వేశారు. హయత్ నగర్ సర్కిల్ పరిధిలో వాల్యుయేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విషయం తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులపై మండిపడ్డారు.
దరఖాస్తులు నిర్లక్ష్యం అంశంలో జోనల్ అధికారులను రోనాల్డ్ రాస్ వివరణ కోరారు. హయతనగర్ సర్కిల్-3లో పన్ను వసూళ్ల విభాగానికి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మహేందర్‌ను బాధ్యుడిగా గుర్తించి సస్పెండ్ చేశారు. అలాగే కుత్బుల్లాపూర్‌లోనూ అభయహస్తం దరఖాస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కనిపించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Praja Palana Application Neglet in Hyderabad: సోమవారం బాలానగర్‌లో రోడ్డుపై అభయహస్తం దరఖాస్తులు దర్శనం ఇచ్చాయి. బాలానగర్ ఫ్లైఓవర్‌పై ఓ ద్విచక్రవాహనంపై ప్రజాపాలన దరఖాస్తుల(Praja Palana Applications)ను ఓ వ్యక్తి తరలిస్తున్నాడు. ఈ క్రమంలో అప్లికేషన్లు ఎగిరి కిందకి పడ్డాయి. దీంతో స్థానికులు వాటి చూసి షాక్ అయ్యారు. వెంటనే వారు ఆ వ్యక్తిని తనకి ఎక్కడవని ప్రశ్నించారు.
రోడ్డుపై ప్రత్యక్షమైన ప్రజా పాలన దరఖాస్తులు - కారణమిదే!
ఎవరో ర్యాపిడోలో బుక్ చేస్తే తాను తీసుకెళ్తుండగా ప్రజాపాలన దరఖాస్తులు కింద పడిపోయాయని వాహనదారుడు వివరించాడు. అతని దగ్గర సుమారు 500కు పైగా దరఖాస్తులు ఉన్నాయని స్థానికులు గుర్తించారు. పైగా అవి హయత్‌నగర్ సర్కిల్ పేరు రాసి ఉన్నాయని తెలుసుకున్నారు. దీంతో సంబంధం లేకుండా ఇంత దూరం ఎవరు తీసుకెళ్తున్నారని స్థానికులు అసహనానికి గురైయ్యారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి విచారణ జరిపింది.