హైదరాబాద్‌లో రోటరీ క్లబ్స్ నిర్వహించిన కార్యక్రమంలో కాటన్ శానిటరీ ప్యాడ్స్ ప్రోత్సాహంపై గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. మహిళలు, అమ్మాయిలకు అవగాహన కల్పించేందుకు, నెలసరి పరిశుభ్రత గురించి మరింత బహిర్గతంగా చర్చించేందుకు ప్రస్తుతం సరైన సమయమని చెప్పారు. కృత్రిమంగా తయారు చేసిన శానిటరీ ప్యాడ్స్‌లో రసాయనాలు ఉండటం వల్ల మహిళలను అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు.
ఇదే సరైన సమయం: గవర్నర్ తమిళిసై - గవర్నర్ తమిళి తాజా వార్తలు
నెలసరి పరిశుభ్రత గురించి మరింత బహిర్గతంగా చర్చించేందుకు ప్రస్తుతం సరైన సమయమని గవర్నర్ తమిళిసై అన్నారు. రోటరీ క్లబ్స్ నిర్వహించిన కార్యక్రమంలో కాటన్ శానిటరీ ప్యాడ్స్ ప్రోత్సాహంపై గవర్నర్ ప్రసంగించారు.

ఇదే సరైన సమయం: గవర్నర్ తమిళిసై
అంతేకాకుండా వీటి వల్ల పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. సంప్రదాయం ప్రకారం మహిళలు నెలసరీ సమయంలో పరిశుభ్రంగా ఉండేందుకు పెద్దలు అవగాహన కల్పించే వారని వ్యాఖ్యానించారు. మహిళలు సరైనా పోషకాహారం తీసుకోవటం లేదని, జంక్ ఫుడ్ వల్ల కావాల్సిన పోషకాలు అందటం లేదని అన్నారు.