తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్​భవన్​లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం - rajbhavan

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్​భవన్​​లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ పాల్గొన్నారు. దివ్యాంగుల విజయాలే సాధారణ యువతకు స్ఫూర్తి అని గవర్నర్​ తమిళిసై పేర్కొన్నారు.

governer-tamilisai-sundararajan-participated-in-world-disabled-day-in-rajbhavan
రాజ్​భవన్​లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

By

Published : Dec 3, 2019, 5:10 PM IST

రాజ్‌భవన్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.

దివ్యాంగుల విజయాలే సాధారణ యువతకు స్ఫూర్తి అని తమిళిసై అభిప్రాయపడ్డారు. వైకల్యం శరీరానికి తప్ప మనసుకుకాదన్న సత్యాన్ని గుర్తించి.. దివ్యాంగులు తమ జీవితంలో ముందుకెళ్లాలని గవర్నర్​ సూచించారు. వేడుకలో దివ్యాంగుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రాజ్​భవన్​లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

ఇవీ చూడండి: 'అత్యాచార నిందితులను 6 నెలల్లోగా ఉరి తీయాలి'

ABOUT THE AUTHOR

...view details