క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించటం ద్వారా దానిని మూలాలతో సహా నివారించవచ్చని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా 7వ వార్షిక సదస్సు 'బిస్కాన్-2019'కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ సహా పలువురు పాథాలజిస్టులు హాజరయ్యారు. భారత్ సహా శ్రీలంక వంటి దేశాలకు చెందిన సుమారు 300మంది రేడియాలజిస్టులు ఈ సదస్సులో పాల్గొని క్యాన్సర్ స్క్రీనింగ్‌పై చర్చించారు.
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదు: గవర్నర్ - మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదు: గవర్నర్
హైదరాబాద్ మారియట్ హోటల్లో బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా 7వ వార్షిక సదస్సు 'బిస్కాన్-2019' జరిగింది. ఈ సదస్సుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదు: గవర్నర్
మహిళలు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన విధంగా తమ ఆరోగ్యంపై దృష్టి సారించటం లేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. క్యాన్సర్ స్క్రీనింగ్‌లో పాథాలజిస్టుల పాత్ర కీలకమైందని చెప్పారు.
ఇవీ చూడండి: మరో అంతర్జాతీయ వేడుకకు వేదికగా భాగ్యనగరం