తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళలు తమలోని సానుకూలతలు ఆస్వాదించాలి' - raise above programme at hightec city

పురుషాధిక్యం ఉన్న మన సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు.

'మహిళలు తమలోని సానుకూలతలు ఆస్వాదించాలి'

By

Published : Oct 24, 2019, 4:37 PM IST

హైటెక్ సిటీలోని ట్రెండెంట్ హోటల్​లో సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్​వర్క్​ ఆధ్వర్యంలో రైజ్ ఎబోవ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎక్కువగా కష్టపడితేనే గుర్తింపు వస్తుందని తమిళిసై వ్యాఖ్యానించారు. పురుషాధిక్యమున్న మన సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోవాలని సూచించారు. నారీమణులు తమలోని సానుకూలతలను ఆస్వాదించాలని తెలిపారు. అమెరికా కాన్సులేట్ జనరల్ జోయెల్ రిఫ్మెన్, అదనపు సీపీ శిఖా గోయల్, సినీ నటి మంచు లక్ష్మి తదితరులు హాజరయ్యారు.

'మహిళలు తమలోని సానుకూలతలు ఆస్వాదించాలి'

ABOUT THE AUTHOR

...view details