దిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన కవాతులో నాలుగు పురస్కారాలు పొందిన ఏపీ, తెలంగాణ ఉమ్మడి డైరెక్టరేట్‌ను గవర్నర్ తమిళిసై అభినందించారు. బుధవారం రాజ్‌భవన్‌లో పురస్కార గ్రహీతలను ఆమె సన్మానించారు.
ఎన్‌సీసీ డైరెక్టరేట్‌కు గవర్నర్ తమిళిసై అభినందనలు - హైదరాబాద్ లేటెస్ట్ వార్తలు
రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రతిష్టాత్మక బ్యానర్‌ను గెలుచుకున్న ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ను గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ప్రశంసించారు. రాజ్‌భవన్‌లో ఎన్‌సీసీ క్యాడెట్‌లను సన్మానించారు.
![ఎన్‌సీసీ డైరెక్టరేట్‌కు గవర్నర్ తమిళిసై అభినందనలు governer tamilisai appreciate to telangana, ap ncc directorate in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10492078-thumbnail-3x2-govern.jpg)
ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ను అభినందించిన గవర్నర్ తమిళిసై
ఉత్తమ డైరెక్టరేట్, మార్చింగ్ కంటింజెంట్, బెస్ట్ కమాండర్ ఆఫ్ ది కంటింజెంట్, బెస్ట్ కమాండర్ అవార్డులు లభించగా... డైరెక్టరేట్‌కు 12 ఏళ్ల తర్వాత పురస్కారం దక్కినట్లైందని గవర్నర్ పేర్కొన్నారు. ఎయిర్ కమాండర్ టీఎస్ సురేష్‌కృష్ణన్, కర్నల్ సుబీర్‌నాగ్ సహా 26 మంది సభ్యుల బృందాన్ని గవర్నర్ సత్కరించారు.
ఇదీ చదవండి:మరుగుదొడ్డిలో చిరుత, శునకం.. వీడియో వైరల్!