హైదరాబాద్ మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో 12 సంవత్సరాలకోసారి జరిగే కోటి కుంభాభిషేకం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు.
మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో గవర్నర్ పూజలు - tamila sai soundara rajan
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ మెట్టగూడలోని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కోటి కుంభాభిషేకం పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ గవర్నర్కు స్వాగతం పలికారు. తమిళిసైతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితర నాయకులు ఉన్నారు.
![మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో గవర్నర్ పూజలు governer tamili sai at ayyappa temple in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5893098-thumbnail-3x2-sgag.jpg)
మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో గవర్నర్ పూజలు
గవర్నర్ రాకతో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళిసైతో పాటు భాజపా కె.లక్ష్మణ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యేక దర్శనం వద్దని... సామాన్య భక్తులతో కలిసి దర్శంచుకొని తమిళిసై అందరికీ ఆదర్శంగా నిలిచారు.
మెట్టుగూడ అయ్యప్ప ఆలయంలో గవర్నర్ పూజలు
ఇదీ చూడండి :మేడారం జాతరకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం