ఈ-ఆఫీస్ విధానంతో పౌరులకు వేగంగా సేవలు అందుతాయని.. జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఈ-ఆఫీస్ విధానం అమలుపై ఐటీ శాఖ అధికారులు గవర్నర్కు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు.
ప్రభుత్వ పాలనలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థాయిల్లో ఈ-ఆఫీసు పద్ధతి ద్వారా ప్రజలకు సమర్ధమైన సేవలందించాలని... పేపర్ లెస్ విధానంతో చెట్లు కొట్టివేయడం తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని వివరించారు. ఈ-ఆఫీస్, ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలు తమకు కావాల్సిన చట్టబద్ధమైన సేవలు సులభతరంగా, హక్కుగా పొందుతారని, వారిని సాధికారత వైపు నడిపిస్తుందని తమిళిసై తెలిపారు.