తల్లి పాలు శిశువులకు ఎంతో ఆరోగ్యకరమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. తల్లి పాలల్లో రోగ నిరోధకాలు ఎక్కువగా ఉంటాయని..... అవి శిశువులను ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై తల్లిపాల వారోత్సవాలు ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. తల్లి పాలు ఎంతో విశిష్టమైనవని, పాలల్లో ఎన్నో పోషకాలుంటాయని ఆమె వివరించారు. చిన్న పిల్లల తల్లులకు గవర్నర్ ప్రొటీన్ పొడి డబ్బాలు, జింకోవిట్ డ్రాప్స్, త్రెప్తిన్ బిస్కెట్‌లు, ఏ టూ జెడ్ ట్యాబ్లేట్‌లు పంపిణీ చేశారు.
తల్లి పాలు శిశువులకు ఎంతో ఆరోగ్యకరం: గవర్నర్ తమిళిసై - governer
తల్లిపాలు ఎంతో విశిష్టమైనవని, పాలల్లో ఎన్నో పోషకాలుంటాయని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్‌భవన్‌లో తల్లిపాల వారోత్సవాలను గవర్నర్ ప్రారంభించారు. తల్లిపాల ఆవశ్యకతను వివరించారు.

తల్లి పాలు శిశువులకు ఎంతో ఆరోగ్యకరం: గవర్నర్ తమిళిసై