ప్రాణాపాయంలో ఉన్న వారిని అదుకోవడమే నిజమైన దైవసేవ అని గవర్నర్ నరసింహన్ అన్నారు. రక్తదాతల దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న పలువురికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు విద్య, వైద్య, సామాజిక రంగాలకు చెందిన పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. రక్తదానానికి కులం, మతం, ప్రాంతం, జాతి, లింగాబేదం అనేది ఏమి లేదని, అందరికి అవసరవుతుందన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్న క్రియేటివ్ మల్టీమీడియా సంస్థకు అవార్డు అందించారు.
'యువతను రక్తదానంవైపు ప్రోత్సహించాలి' - governer
స్వప్రయోజనాలు అశించకుండా సమాజ సేవగా భావించి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'యువతను రక్తదానంవైపు ప్రోత్సహించాలి'