తెలంగాణ

telangana

ETV Bharat / state

'పెరిటోనియల్ డయాలసిస్ సేవలు మరింత చేరువకావాలి'

పెరిటోనియల్ డయాలసిస్ సేవలు పేదలకు చేరువకావడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో జరిగిన అంతర్జాతీయ బ్లడ్ ప్యూరిఫికేషన్ సొసైటీ 37వ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని.. డాక్టరుగా తన అనుభవాలను పంచుకున్నారు.

By

Published : Sep 18, 2019, 2:33 PM IST

'పెరిటోనియల్ డయాలసిస్ సేవలు మరింత చేరువకావాలి'

అంతర్జాతీయ బ్లడ్ ప్యూరిఫికేషన్ సొసైటీ(ఐఎస్​బీపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 37వ అంతర్జాతీయ సదస్సుకు భాగ్యనగరం వేదికైంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను గవర్నర్​గా కాకుండా.. ఓ వైద్యురాలిగా సదస్సుకు హాజరయ్యానని తమిళిసై పేర్కొన్నారు. పెరిటోనియల్​ డయాలసిస్ వంటి అత్యాధునిక చికిత్సలు రక్త శుద్ధికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. అలాంటి చికిత్సను పేదలకు అందించేందుకు దివంగత మహిళా నాయకులు సుష్మా స్వరాజ్, జయలలిత కృషి చేశారని కొనియాడారు. వైద్య విద్యార్థినిగా ఉన్నప్పుడు పలుమార్లు డయాలసిస్ అసిస్టెంట్​గా పనిచేశానని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సదస్సుల ద్వారా వైద్యులు డయాలసిస్​కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

'పెరిటోనియల్ డయాలసిస్ సేవలు మరింత చేరువకావాలి'

ABOUT THE AUTHOR

...view details