తెలంగాణ

telangana

ETV Bharat / state

UPADHIHAMI: ఉపాధిహామీ నిధుల విడుదలకు సై అన్న కేంద్రం

జాతీయ ఉపాధిహామీ నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. అందుకు సంబంధించి 1432 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉపాధిహామీ నిధుల విడుదలకు సై అన్న కేంద్రం
ఉపాధిహామీ నిధుల విడుదలకు సై అన్న కేంద్రం

By

Published : Jun 26, 2021, 11:36 AM IST

జాతీయ ఉపాధిహమీ పథకానికి సంబంధించి 1432 కోట్ల రూపాయల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. అందుకు అనుగుణంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బడ్జెట్​లో కేటాయించిన 761 కోట్లతో పాటు అదనంగా 671 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ కింద రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ఇవ్వాలని కేంద్రానికి ఎప్పట్నుంచో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవలి దిల్లీ పర్యటన సందర్భంగా కూడా పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని నిధులు విడుదల చేయాలని కోరారు.

ఇదీ చూడండి:Delta Plus: అమ్మో.. ఇక్కడా తొలి డెల్టా ప్లస్‌ కేసు

ABOUT THE AUTHOR

...view details