వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ ఎలాంటి నేర చరిత్ర లేని అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని సుపరిపాలనా వేదిక కోరింది. గత ఎన్నికల్లో 72మంది నేర చరిత్ర గల అభ్యర్థులకు వివిధ రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చాయని... వీరిలో 8మంది మహిళలు కూడా ఉన్నారని తెలిపింది. 72 మందిలో 30 మంది అభ్యర్థులు విజయం సాధించారని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి వెల్లడించారు.
'బల్దియా ఎన్నికల్లో నేర చరిత్ర లేని అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలి'
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయపార్టీలన్నీ ఎలాంటి నేర చరిత్రలేని అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని సుపరిపాలనా వేదిక కోరింది. ఒకవేళ వారికి టికెట్ ఇస్తే ఎన్నికల నిఘా వేదిక తరఫున వారి గురించి ఓటర్లకు తెలియజేస్తామని వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి స్పష్టం చేశారు.
సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి
ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలిలో 20 శాతం మంది నేర చరిత్ర గల వారున్నారని... ఇలాంటి వారి వల్ల ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదని పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పాలకమండలిలో తెరాస తరఫున 16మంది కార్పొరేటర్లు, ఎంఐఎం తరఫున 13 మంది, భాజపా తరఫున ఒక కార్పొరేటర్ నేరచరిత్ర కలిగి ఉన్నారని తెలిపారు. రాజకీయ పార్టీలు ఒకవేళ నేరచరిత్ర గల వారికి టికెట్లు ఇస్తే.. ఎన్నికల నిఘా వేదిక తరఫున వారి గురించి ఓటర్లకు తెలియజేస్తామని హెచ్చరించారు.