Goverment Getting Lot Of Complaints in Prajavani Program : ప్రజా సమస్యల పై ఫిర్యాదులు స్వీకరించే ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ప్రజా భవన్‌లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చారు. ఇప్పటి వరకు 5 వేలపై చిలుకు ఫిర్యాదులు అధికారులకు అందాయి. రెండు పడుకగదుల ఇళ్లు, పెన్షన్లు, భూముల సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన దివ్యాంగుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రజావాణి కార్యక్రమంలో వృద్ధురాలితో కలెక్టర్ ముచ్చట
జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణికి సమస్యలపై ఫిర్యాదులు పోటెత్తాయి. తెలంగాణలోని పలుజిల్లాల నుంచి ప్రజావాణికి హాజరైన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను దరఖాస్తుల రూపంలో సమర్పించారు. మంత్రి కొండా సురేఖ ప్రజలు పేర్కొన్న సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తమ సమస్యల గురించి తెలపడానికి వచ్చిన వారిని ప్రత్యేక క్యూలైన్లలో ప్రజాభవన్‌లోకి అనుమతించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీల్ చైర్లలో వారిని సిబ్బందిలోనికి తీసుకువెళ్లారు.
బాన్సువాడ డివిజన్లో తొలి ప్రజావాణి కార్యక్రమం
"నేను మధిర నుంచి వచ్చాను. నేను 12సంవత్సరాల నుంచి మెదడు వ్యాధితో బాధపడుతున్నాను. మెదడు ఆపరేషన్ చేసినప్పుడు కాలు, చేయి పడిపోయాయి. ఇప్పటివరకు నాకు 8 ఆపరేషన్లు చేశారు. అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు నేను మందులు వాడుతూ బతుకున్నాను. మా నాన్న ఒక్కరే పని చేస్తారు. వారు సంపాదించిందంతా మందులకే ఖర్చు అవుతుంది. ఇంట్లో పరిస్థితి బాలేదు. నా సమస్యకు రేవంత్ రెడ్డి పరిష్కారం చూపిస్తారని వచ్చాను- ఫిర్యాదుదారు"