కరోనా వైరస్ నివారణకు ప్రకృతి సహజ సిద్ధమైన నీరాను సేవించాలని... ప్రజలను తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి కోరింది. ఔషధ గుణాలున్న నీరాను ప్రతి ఒక్కరూ.. సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం నీరా చట్టం తీసుకురావడాన్ని హర్షిస్తూ... మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్ కూడలిలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్రపటాలకు నీరాభిషేకం చేశారు.