తెలంగాణ

telangana

ETV Bharat / state

బుల్లెట్​ ప్రూఫ్​ వాహనం వాడితే డబ్బులు చెల్లించాలా?: రాజాసింగ్​

గోషా మహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​కు హైదరాబాద్​ పోలీసులు షాకిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుల్లెట్​ ప్రూఫ్​ వాహనం ఉపయోగిస్తే కిలోమీటరుకు రూ. 38 చొప్పున చెల్లించాలని ఆయనకు నోటీసు పంపించారు. నోటీసు అందుకున్న ఎమ్మెల్యే.. విషయం తెలుసుకొని కంగు తిన్నారు.

mla rajasingh
ఎమ్మెల్యే రాజాసింగ్

By

Published : Feb 17, 2021, 4:13 PM IST

Updated : Feb 17, 2021, 8:52 PM IST

ఎన్నికల కోడ్‌లో భాగంగా బుల్లెట్‌ ప్రూఫ్​ వాహనం ఉపయోగిస్తే.. కిలో మీటరుకు రూ. 38, డ్రైవర్‌కు అదనంగా డబ్బులు చెల్లించాలని.. పోలీసు అధికారుల నుంచి తనకు నోటీసు వచ్చిందని గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలిపారు. నోటీసును చూసి ఆశ్చర్యానికి గురయ్యానని అన్నారు. అసలు తాను బుల్లెట్‌ ప్రూఫ్​ వాహనం అడగలేదని.. తనకు ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని రాజాసింగ్​ గుర్తు చేశారు.

బుల్లెట్​ ప్రూఫ్​ వాహనం వాడితే డబ్బులు చెల్లించాలా?: రాజాసింగ్​

అనేక మంది మంత్రులు బుల్లెట్‌ ప్రూఫ్​ వాహనం వాడుతున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. వాళ్లందరూ డబ్బులు కడుతున్నారా అని ప్రశ్నించారు. మంత్రులకు కొత్త వాహనాలు ఇచ్చి.. ప్రమాదం పొంచి ఉన్న తమకేమో పాత వాహనాలు ఇచ్చిందని మండిపడ్డారు. ఇలాంటి వాటికి డబ్బులు చెల్లించాలనడం సరైందికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'పెట్రో' ధరలను వెంటనే తగ్గించాలి: సీపీఎం

Last Updated : Feb 17, 2021, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details