తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపీ అర్వింద్​పై దాడిని ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్ - తెలంగాణ భాజపా తాజా వార్తలు

నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై తెరాస కార్యకర్తల దాడిని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ ఖండించారు. దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

mla rajasingh condemned attack on MP Arvind
ఎంపీ అర్వింద్​పై దాడిని ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్

By

Published : Jul 12, 2020, 6:09 PM IST

వరంగల్​లో భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​పై... తెరాస కార్యకర్తల దాడిని ఎమ్మెల్యే రాజాసింగ్​ ఖండించారు. అర్వింద్​ వాహనంపై రాళ్లు, గుడ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

మేమూ చేయగలం..

ఇలాంటి పనులు చేయడం తగదని... అనుకుంటే తాము ఇలాంటి దాడులు చేయగలమని రాజాసింగ్​ అన్నారు. భాజపా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు... ప్రజల్లోకి వెళ్తున్నాయనే భయంతోనే తెరాస ఇలాంటి దాడులకు పాల్పడుతోందని రాజాసింగ్​ ఆరోపించారు.

ఇదీ చూడండి:భాజపా నేత, ఎంపీ అర్వింద్ కారుపై తెరాస కార్యకర్తల దాడి

ABOUT THE AUTHOR

...view details