భాగ్యలక్ష్మీ ఆలయంపై ఒవైసీ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకొని... క్షమాపణ చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. అమ్మవారి ఆలయాన్ని అక్కడి నుంచి తీయాలని పోలీసులు, జీహెచ్‌ఎంసీ వాళ్లకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు చేశారని ఆరోపించారు. పురాతన ఆలయం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుందన్నారు. హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టే అలవాటు మానుకోవాలని హితవు పలికారు. అయోధ్య తీర్పు తర్వాత హిందూ ముస్లింల మధ్య ఎలాంటి ఉద్రిక్త భావన లేదని... ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఒవైసీకి భాగ్యలక్ష్మీ ఆలయం ఎందుకు గుర్తుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. దేశం ప్రశాంతంగా ఉండటం ఓవైసీకి ఇష్టంలేదని రాజాసింగ్ దుయ్యబట్టారు.
'ఒవైసీ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి' - 'ఒవైసీ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి'
భాగ్యలక్ష్మీ ఆలయంపై అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకొని... క్షమాపణ చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
'ఒవైసీ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి'