కబేళాలకు ఆవులను తరలిస్తోన్న ఓ వాహనాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు 45 గోవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డగించారు. పట్టుబడిన ఆవులను గోశాలకు తరలించారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గోవులను కబేళాలకు తరలిస్తుండగా పట్టుకున్న రాజాసింగ్ - telangana news
ఆవులను అక్రమంగా తరలిస్తోన్న ఓ వాహనాన్ని ఎమ్మెల్యే రాజా సింగ్ అడ్డగించారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు 45 గోవులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆవులను పట్టకున్న ఎమ్మెల్యే రాజాసింగ్
ఆవులను కబేళాలకు తరలిస్తున్న వారికి పోలీసులు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గోరక్షణ చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. అక్రమంగా గోవులను తరలిస్తుంటే పోలీసు శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ఏర్పాటులో కాకాది కీలక పాత్ర: కిషన్ రెడ్డి