తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు - తెలంగాణ వార్తలు

తెరాసపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నేతృత్వంలోనే హైదరాబాద్​లో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెరాస అవినీతికి అడ్డాగా మారిందని మండిపడ్డారు.

goshamahal-mla-raja-singh-comments-on-trs-government-about-illegal-constructions-in-hyderabad
అవినీతి అడ్డాగా తెరాస... కేటీఆర్ ఆశీర్వాదంతోనే...: రాజాసింగ్

By

Published : Mar 7, 2021, 2:15 PM IST

అవినీతి అడ్డాగా తెరాస... కేటీఆర్ ఆశీర్వాదంతోనే...: రాజాసింగ్

అవినీతికి అడ్డాగా తెరాస మారిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కేటీఆర్​ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో అక్రమంగా కట్టడాలు జరుగుతున్నాయని విమర్శించారు. అయినా మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు ఏ ఒక్క బిల్డర్​పై అక్రమ కట్టడాల గురించి చర్యలు తీసుకోలేదని రాజాసింగ్ అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, అధికారులకు ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందన లేదని మండిపడ్డారు.

ఇదీ చదవండి:భాజపా గూటికి దిగ్గజ నటుడు మిథున్​ చక్రవర్తి

ABOUT THE AUTHOR

...view details