నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలు నిర్వహించుకోవడం మన సంస్కృతి కాదని... విదేశీ సంస్కృతి అని గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. డిసెంబర్ 31న యువకులు ఈ వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు. ఏటా ఎంతో మంది యువకులు తాగిన మత్తులో ఆక్సిడెంట్లకు గురై మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన సంవత్సర వేడుకలు విదేశీ సంస్కృతి: రాజాసింగ్ - హైదరాబాద్ అప్డేట్స్
నూతన సంవత్సర వేడుకలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అది విదేశీ సంస్కృతి అని ఆయన అన్నారు. ఈ వేడుకల పేరుతో ఏటా ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన సంవత్సర వేడుకలు విదేశీ సంస్కృతి: రాజాసింగ్
తాగి మృతి చెందడం కంటే ధర్మం కోసం, కనిపెంచిన తల్లిదండ్రుల కోసం ప్రాణ త్యాగం చేయడం ఎంతో మేలని ఆయన అన్నారు.
ఇదీ చదవండి:ఇద్దరు తాగుబోతుల మధ్య ఘర్షణ... ఒకరికి గాయాలు