తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేనా.. రౌడీషీటర్​నా: రాజాసింగ్​ - ఎమ్మెల్యేనా.. రౌడీషీటర్​నా: రాజాసింగ్​

తాను ఎమ్మెల్యేనో... రౌడీషీటర్‌నో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ చెప్పాలని గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీటర్ల జాబితాలో తమ పేరు ఉండటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

goshamahal bjp mla raja Singh fire on hyderabad police
ఎమ్మెల్యేనా.. రౌడీషీటర్​నా: రాజాసింగ్​

By

Published : Dec 18, 2019, 6:19 PM IST

Updated : Dec 18, 2019, 11:06 PM IST

హైదరాబాద్​ మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీటర్స్‌ జాబితాలో గోషామహాల్‌ తమ పేరు ఉండటం పట్ల ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాసేవ చేస్తూ... రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనను రౌడీషీటర్ల జాబితాలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఎమ్మెల్యేనో... రౌడీషీటర్‌నో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ సమాధానం చెప్పాలని గోషామహాల్‌ డిమాండ్‌ చేశారు.

తెరాస వారు కూడా ...

తెరాసలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకప్పుడు రౌడీషీటర్లే అని అన్నారు. వారి పేర్లు జాబితాలో ఉన్నాయా అని పోలీస్‌ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. వారి పేర్లను రౌడీషీటర్ల జాబితాలో చేర్చే దమ్ము తెలంగాణ పోలీసులకు ఉందా అని సవాల్‌ విసిరారు.

ఎమ్మెల్యేనా.. రౌడీషీటర్​నా: రాజాసింగ్​

ఇదీ చూడండి: గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి

Last Updated : Dec 18, 2019, 11:06 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details