తెలంగాణ

telangana

ETV Bharat / state

'జీవోలు విడుదల.. పోలీసులు ఆటంకం కల్గించొద్దు' - telangana

తెలంగాణలో కరోనా కారణంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది. అందుకు సంబంధించిన జీవో 45,46లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్​కుమార్ విడుదల చేశారు. పలువురు ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్గించకూడదని పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రజలు బయటకు రాకూడదని ప్రభుత్వం ప్రకటించింది.

gos released don't interrupt the police in telangana lockdown
'జీవోలు విడుదల.. పోలీసులు ఆటంకం కల్గించొద్దు'

By

Published : Mar 25, 2020, 6:38 AM IST

Updated : Mar 25, 2020, 8:36 AM IST

రాష్ట్రంలో లాక్​డౌన్‌ ప్రకటించడం వల్ల ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర సర్వీసులు తప్ప ఏ వ్యక్తులను అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన జీవో 45,46లను జారీ చేశారు.

ఆ నిబంధనల నుంచి సచివాలయం సాధారణ పరిపాలన విభాగం, హైదరాబాద్‌లోని అన్ని సచివాలయ హెడ్‌ ఆఫ్‌ డిపార్ట్​మెంట్లు, జిల్లా కలెక్టర్లు, రెవిన్యూ డివిజినల్‌ ఆఫీసర్లు, మండల కార్యాలయాలు, పోలీసులు, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, అర్బన్‌ లోకల్‌ బాడీస్‌/పంచాయతీలు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, ఎక్సైజ్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌, విద్యుత్, అగ్రికల్చర్‌, సివిల్‌ సప్లయ్‌, పోల్యుషన్‌, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ విభాగాలు, జాతీయ సమాచార కేంద్రాల ఉద్యోగులను అనుమతించాలని పేర్కొన్నారు. ఉద్యోగుల గుర్తింపు కార్డులను పరిశీలించి విధులకు ఆటంకం కల్గించకుండా పంపించాలని పోలీసులను ఆదేశించారు.

ఇదీ చూడండి :'ఆ నియోజకవర్గంలో ఇప్పటికి ఒక్క కేసు నమోదు కాలేదు'

Last Updated : Mar 25, 2020, 8:36 AM IST

ABOUT THE AUTHOR

...view details