తెలంగాణ

telangana

By

Published : Jan 19, 2021, 11:00 PM IST

ETV Bharat / state

ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి : సీఐ శ్రీనివాస్

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్లేనని గోపాలపురం ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాహనదారులకు ఆయన అవగాహన కల్పించారు.

gopalapuram traffic inspeter was educated motorists on road safety
ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి : ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సికింద్రాబాద్​ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సంగీత్ చౌరస్తాలో కార్లు, ద్విచక్ర వాహనదారులకు ఆయన అవగాహన కల్పించారు.

ద్విచక్ర వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్మెట్ ధరించాల్సిందేనని ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు, గంటకు 40 కీలోమీటర్లకు మించి వేగంగా వాహనాలను నడపరాదని సూచించారు. సిగ్నల్స్ జంప్ చేయడం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందన్న ఆయన కార్లు నడిపేవారు సీటు బెల్టు ధరించాలని చెప్పారు. సెల్‌ఫోన్​లో మాట్లాడుతూ వాహనాన్ని నడపడం, త్రిబుల్ డ్రైవింగ్ లాంటి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు బాలకృష్ణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీపై హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details