సికింద్రాబాద్ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన సంగెం స్వాతి పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లేందుకు వాహనం కోసం రోడ్డుపైకి వచ్చింది. ఎంతసేపటికి వాహనం దొరకకపోవడం వల్ల ఆమె తల్లి సమీపంలోని చెక్‌పోస్టు వద్దకు వెళ్లి పోలీసుల సాయం కోరింది.
గర్భిణికి సాయం చేసిన గోపాలపురం పోలీసులు - Hyderabad lockdown 2021
పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న ఓ గర్భిణిని గోపాలపురం పోలీసులు తమ వాహనంలో తరలించారు. కోఠి ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించి తమ ఉదారత చాటుకున్నారు.
![గర్భిణికి సాయం చేసిన గోపాలపురం పోలీసులు gopalapuram police, gopalapuram police helped pregnant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:55:20:1621923920-11889045-police.jpg)
గోపాలపురం పోలీసులు, గర్భిణికి పోలీసుల సాయం
స్పందించిన గోపాలపురం ఇన్స్పెక్టర్ సాయిఈశ్వర్ గౌడ్.. గర్భిణిని, ఆమె తల్లిని వాహనంలో పంపారు. కానిస్టేబుల్, హోంగార్డులను వారి వెంట పంపారు. కోఠిలోని ప్రసూతి ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. లాక్డౌన్ సమయంలో తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులు.. తమ సమస్య విని వెంటనే స్పందించి సాయం చేసినందుకు గర్భిణి తల్లి, బంధువులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
- ఇదీ చదవండినదిలో మునిగిన నాటుపడవలు.. 8 మంది గల్లంతు