తెలంగాణ

telangana

ETV Bharat / state

గూగుల్​ పే కస్టమర్​ కేర్​ పేరుతో మోసం - కస్టమర్​ కేర్​ పేరుతో మోసం

వినియోగదారుడి సమస్యనే అవకాశంగా మలుచుకుని సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోయారు. గూగుల్​ పే కస్టమర్​ పేరుతో ఓ వ్యక్తి నుంచి 64వేల రూపాయలను కాజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

google pay fraud case in hyderabad
గూగుల్​ పే కస్టమర్​ కేర్​ పేరుతో మోసం

By

Published : Jun 21, 2020, 6:59 PM IST

గూగుల్ పే కస్టమర్ కేర్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తిని మోసం చేశారు. గూగుల్ పే ద్వారా హైదరాబాద్​ మాసబ్​ట్యాంక్​కు చెందిన రాజేష్​ అనే వ్యక్తి ఫోన్ రీఛార్జ్ చేశాడు. రీఛార్జ్ కాకపోవడం వల్ల... కస్టమర్ కేర్ కోసం ఆ వ్యక్తి గూగుల్​లో సెర్చ్ చేశాడు. అక్కడ ఉన్న ఓ నంబర్‌కు కాల్ చేసి తన సమస్యను వివరించారు. అదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు.. తక్షణం ఫోన్ రీఛార్జ్ కావాలంటే తాము పంపించిన లింక్‌ను యాక్సెప్ట్ చేయాలని బాధితుడిని నమ్మించారు.

ఆ వెంటనే లింక్‌ పంపించగా.. బాధితుడు యాక్సెప్ట్ చేశాడు. బాధితుడి యూపీఐ నంబర్ ద్వారా 64వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. మోసాన్ని గ్రహించిన బాధితుడు రాజేష్.. హైదరాబాద్​ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో ఇంటర్‌ విద్యార్థిని అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details