అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న వెంచర్ క్యాపిటల్ సంస్థ మంత్ర క్యాపిటల్ 6 కోట్ల డాలర్ల గ్లోబల్ ఫండ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ ఫండ్ ద్వారా ప్రజలకు మంచి చేసే కృత్రిమ మేధ, బ్లాక్ చైన్, డ్రోన్స్, రోబోటిక్స్ లాంటి డీప్ టెక్ అంకురాల్లో ప్రీ సిరీస్ నుంచి పోస్ట్ సిరీస్ వరకు పెట్టుబడులు పెట్టనున్నారు.
ప్రజలకు మంచి చేసే అంకురాలకు పెట్టుబడులు - good people services Investing in startups at hyderabad
హైదరాబాద్‌లో అమెరికా కేంద్రంగా పనిచేస్తోన్న వెంచర్ క్యాపిటల్ సంస్థ మంత్ర క్యాపిటల్... 6 కోట్ల డాలర్ల గ్లోబల్ ఫండ్‌ను ఆరంభించింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ప్రజలకు మంచి చేసే అంకురాల్లో పెట్టుబడులు పెట్టడం అని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
ప్రజలకు మంచి చేసే అంకురాలకు పెట్టుబడులు
ఇప్పటికే 2.4 కోట్ల డాలర్లు సమకూర్చాం... ఆహార, వ్యవసాయ, విద్య, అంతరిక్షంలో పనిచేసే అంకురాలు తమ మొదటి ప్రాధాన్యం అని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ అమెరికా, భారత్‌తో తమ పెట్టుబడులను ప్రారంభిస్తున్నామని వారు ప్రకటించారు. టీ-హబ్ లాంటి ఇంక్యుబేటర్లతో కూడా కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి : 'మొక్కలు ఎండితే... పదవులు పోతాయి'
TAGGED:
Mantra Capital, India,