తెలంగాణ

telangana

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

By

Published : Mar 14, 2019, 12:36 PM IST

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బంపర్ బొనాంజా​ ప్రకటించింది.  సీజన్ టికెట్లపై గరిష్ఠ దూరాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిమాండ్ అధికంగా ఉన్న 11 మార్గాలను ఎంపిక చేసింది. తాజా నిర్ణయం ద్వారా దూరం 150 కి.మీల నుంచి 160 కి.మీల వరకు పెరగనుంది.

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

రైల్వే ప్రయాణికులకు శుభవార్త
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్తను అందించింది. సీజన్​ టికెట్లపై గరిష్ఠ దూరాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే సీపీఆర్వో రాకేష్​ తెలిపారు. ప్రయాణికుల డిమాండ్​కు అనుగుణంగా 150కి.మీ నుంచి 160 కి.మీల వరకు దూరాన్ని పెంచుతూ రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ మార్గాల్లో వర్తింపు...

హైదరాబాద్-వరంగల్, మల్కాజ్ గిరి-నిజామాబాద్, కాచిగూడ-వనపర్తి, లింగంపల్లి-కాజీపేట, వరంగల్-మధిర, జనగాం-మంచిర్యాల, యాద్గిరి-వికారాబాద్, చిత్తూరు-రాజంపేట, గుంతకల్లు-పెనుకొండ, శ్రీకాళహస్తి-పెరంబూరు, సామర్లకోట-విశాఖపట్నం మార్గాల్లో తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది.

ఇవీ చూడండి:కాంగ్రెస్​ అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జనలు

ABOUT THE AUTHOR

...view details