డప్పు చప్పుళ్లు, పోతు రాజులు, శివసత్తుల శిగాలు వీటన్నింటి కలబోతే బోనాల పండుగ. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే ఈ ఆషాడ మాస బోనాలు కరోనాతో కళ తప్పింది. రాష్ట్రంలో వైరస్ విజృంభిస్తోండడం వల్ల సాదాసీదాగా బోనాలు నిర్వహిస్తున్నారు.
కళతప్పిన సంబురం: సాదాసీదాగా గోల్కొండ బోనాలు - బోనాల వార్తలు
ప్రతి సంవత్సరం అంగరంగవైభవంగా జరిగే బోనాలు కరోనాతో ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా మొదలయ్యాయి. కరోనా కారణంగా గోల్కొండ ఆలయ కమిటీ సభ్యులే అమ్మవారికి బోనం సమర్పించారు.
ప్రతి సంవత్సరం గోల్కొండ బోనాలతో సందడి మొదలయ్యేది. కరోనా కారణంగా ఈ ఏడాది గోల్కొండ బోనాలు ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లంగర్ హౌస్ వద్ద తొట్టెల పూజానంతరం.. గోల్కొండ చోట బజార్ వద్దకు చేరుకున్నారు. దేవాలయ అర్చకులైన దిగంబర్ రావు ఇంటివద్ద దేవతామూర్తులకు పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి బయల్దేరి గోల్కొండ పైకి వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు.
ఇదీ చూడండి:హరితహారంలో కేసీఆర్.. నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ప్రారంభించిన సీఎం