తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్​ : కనుమరుగయ్యే దిశలో స్వర్ణకార వృత్తి - లాక్​డౌన్​తో సమస్యల్లో స్వర్ణకారులు

పండుగ, పెళ్లి, ఫంక్షన్...​ వేడుక ఏదైనా మగువలు మరింత అందంగా కనిపించాలంటే ఆభరణాలు అలంకరించుకోవాల్సిందే. అతివలను, ఆభరణాలను వేరు చేసి చూడలేమంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే మహిళల జీవన విధానంలో అవి అంతగా అంతర్భాగం అయిపోయాయి. మరి అతివలు, బంగారు ఆభరణాలు ఇంతలా మెరిసిపోయేలా చేసే ఆ ఆజ్ఞాతవాసుల జీవన విధానం ప్రస్తుతం ఎలా ఉంది? వీరి జీవితంలో లాక్​డౌన్​ తీసుకొచ్చిన మార్పులేంటి? బంగారంలో ఉండే మెరుగులు వీరి జీవితంలోనూ ఉన్నాయా?

Goldsmiths facing problems due to corona pandemic situations
కనుమరుగయ్యే దిశలో స్వర్ణకార వృత్తి

By

Published : Jun 7, 2020, 7:36 PM IST

Updated : Jun 7, 2020, 9:23 PM IST

స్వర్ణకారులు... మగువల అందాలను రెట్టింపు చేసే కార్మికులు... బంగారు, వెండి నగలకు మెరుగులు దిద్దే శ్రామికులు... అతివలు ధరించే అందాల ఆభరణాల వెనక కనపించని అజ్ఞాత వాసులు. ఇంతా చేసినా... బంగారానికి ఉన్న మెరుగు తమ బతుకులలో మాత్రం లేదని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్ల వంటి వేడుకలు ఏవైనా ఉంటేనే వీరికి పని ఉండేది. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్​డౌన్ విధించడంతో పెళ్లిళ్లు, ఫంక్షన్​లు, వేడుకలు అన్నీ రద్దయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో... చేయడానికి పని లేక, కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

లాక్​డౌన్​తో రెండు నెలల పాటు దుకాణాలు మూతపడ్డాయి. పెళ్లిళ్ల సీజన్​ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం లాక్​డౌన్​లో సడలింపులు ఇవ్వడంతో తిరిగి వ్యాపారాలు ప్రారంభించారు. అయినప్పటికీ ఆభరణాల తయారీకి కొనుగోలుదారులెవరూ ముందుకు రావడం లేదు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వందలాది మంది వినియోగదారులతో నిత్యం కళకళలాడే సికింద్రాబాద్ జనరల్ బజార్... ఇప్పుడు ఎవరూ లేక వెలవెలబోతోంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్రమక్రమంగా స్వర్ణకార వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదముందంటున్నారు విశ్వకర్మలు.

రైతులకు రైతుభరోసా పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తున్నట్టుగానే, తమను కూడా ఆర్థికంగా ఆదుకోవాలని స్వర్ణకారులు వేడుకుంటున్నారు. అధిక మొత్తంలో బంగారం దిగుమతులతో స్వర్ణకార వ్యవస్థ ఇబ్బందుల్లో ఉందని... ప్రభుత్వమే చొరవ చూపి వాటిని పరిష్కరించాలని కోరారు. ముంబయి నుంచి పెద్ద ఎత్తున బంగారం దిగుమతి అవుతోందని... దీంతో స్థానిక పసిడి కొనుగోళ్లు తగ్గిపోయి స్వర్ణకారుల జీవితాలు దయనీయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లాక్​డౌన్​ ఎఫెక్ట్​ : కనుమరుగయ్యే దిశలో స్వర్ణకార వృత్తి

ఇదీ చూడండి :'అసలే లాక్​డౌన్​.. ఆపై అధిక విద్యుత్​ బిల్లులు '

Last Updated : Jun 7, 2020, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details