Goldman Sachs will expand into Telangana : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్ దిగ్గజ సంస్థ గోల్డ్మెన్ సాచ్(Goldman Sachs Company) తెలంగాణలో తన భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR)తో అమెరికాలోని న్యూయార్క్(New yark) నగరంలో కంపెనీ కేంద్ర కార్యాలయంలో సంస్థ ఛైర్మన్, సీఈఓ డేవిడ్ ఎం సోలమన్తో నేడు సమావేశమయ్యారు. బృంద చర్చల అనంతరం కంపెనీ ఈమేరకు తన ప్రకటనను తెలిపింది.
హైదరాబాద్ నగరంలో గోల్డ్మెన్ సాచ్ సంస్థ కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరించేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఆ సంస్థ ప్రకటించిన విస్తరణ ప్రణాళికలలో భాగంగా.. ప్రస్తుతం 1000 మంది ఉన్న చోట రెండు రెట్లు పెంచి 2000 మంది నిపుణులకు అదనంగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందుకోసం సుమారు మూడు లక్షల చదరపు అడుగల విస్తీర్ణం గల కార్యాలయ విస్తరణను చేపట్టనున్నట్లు వివరించింది. బ్యాంకింగ్ సేవలు,బిజినెస్ అనలిటిక్స్, ఇంజినీరింగ్ వంటి వివిధ రంగాలలో గోల్డ్మెన్ సాచ్ సంస్థ కార్యకలాపాల బలోపేతం కోసమే.. ఈ నూతన కేంద్రం పనిచేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు మంత్రి కేటీఆర్ వారికి అభినందనలు తెలిపారు.
KTR America Tour Updates : అట్లుంటది కేటీఆర్తోని.. రాష్ట్రానికి కొనసాగుతోన్న పెట్టుబడుల ప్రవాహం
Minister KTR America Tour :తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా గతవారం అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్ వెళ్లారు. అంతకంటే ముందు ఇదే ఏడాది మే నెలలో యూకే, అమెరికా పర్యటనలు చేసి విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చారు. 80కి పైగా వ్యాపార సమావేశాలకు హాజరైన కేటీఆర్.. న్యూయార్క్, లండన్, హ్యూస్టన్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్లలో పర్యటించారు. ఈ పర్యటన రెండు వారాల పాటు సాగింది. పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. ఆ సంస్థల పెట్టుబడులతో దాదాపు 42 వేల మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్ కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.