తెలంగాణ

telangana

ETV Bharat / state

వీరుడా వందనం.. స్వర్ణోత్సవ సంబురం - Golden Jubilee Celebrations in Secunderabad Parade Ground

పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో భారత్‌ అద్భుత విజయానికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్వర్ణోత్సవ విజయ వసంతం వేడుకలను తెలంగాణ, ఆంధ్రా ఆర్మీ సబ్‌ ఏరియా నిర్వహిస్తోంది. నాటి యుద్ధ వీరులకు గౌరవ సన్మానం ఏర్పాటుచేసింది. యుద్ధ ట్యాంకులు, మిషన్‌ గన్‌లు, రాడార్లు, సైనిక హెలికాప్టర్‌, క్షిపణులు, రాకెట్‌ లాంచర్ల వరకు పలు ఆయుధాలను సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో గురువారం ప్రదర్శిస్తున్నారు.

Golden Jubilee Celebrations on the occasion of the 50th anniversary of India victory in the 1971 war with Pakistan
వీరుడా వందనం.. స్వర్ణోత్సవ సంబురం

By

Published : Feb 11, 2021, 10:24 AM IST

ప్రదర్శన తిలకిస్తున్న సైనిక కుటుంబాలు

  • 130 ఎంఎం గన్‌ ఎం-46 చూడటానికి త్రికోణాకారంలోఉంది. శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలదు. పేల్చాలంటే 9 మంది జవాన్లు అవసరం. నిమిషానికి రెండు రౌండ్లు పేల్చవచ్ఛు రష్యా నుంచి దిగుమతి చేసుకొన్న ఇది 1968లో సైన్యంలో చేరింది.

బీఎంపీ యుద్ధ ట్యాంకు.. రహదారి, ఎత్తుపల్లాలున్న ప్రదేశాలతో పాటు నీళ్లలోనూయుద్ధ ట్యాంకు వెళ్లగలదు. సోవియట్‌ యూనియన్‌కు చెందిన ఈ ట్యాంకు 1966లో భారత సైన్యంలో చేరింది. కమాండర్‌, డ్రైవర్‌, గన్నర్‌తో పాటూ మరో 8 మంది సైనికులు ఇందులో ప్రయాణించొచ్చు. 73 ఎంఎం బ్యారల్‌ ఉంటుంది. 40 రౌండ్లు పేల్చవచ్చు.

ఎక్కడ?

పరేడ్‌గ్రౌండ్స్‌ ఈస్ట్‌గేట్‌ (జేబీఎస్‌ మార్గంలో) ఉదయం 9 గంటల నుంచి.. ఎవరైనా సందర్శించొచ్ఛు.

క్షిపణులు..

  • ప్రదర్శనలో ఆధునాతన యాంటీ ట్యాంకు గైడెడ్‌ మిసైల్స్‌ను చూపించనున్నారు. దీన్ని ఏటీజీఎంగా పిలుస్తుంటారు. శత్రువులపై 25 మీటర్లు మొదలు 2 కి.మీ. దూరం వరకు ప్రయోగించవచ్చు. నిమిషానికి మూడు మిసైల్స్‌ను వదలొచ్చు.

నిఘాకు దొరికేలా..

  • శత్రువుల కదలికలను కనిపెట్టేందుకు అధునాతన సర్వెలెన్స్‌ వ్యవస్థలను సైన్యం ఉపయోగిస్తోంది. రేడియో ట్రాక్‌ సిస్టమ్స్‌, వెహికల్‌ రోడ్‌ టర్మినల్‌ వ్యవస్థల సాయంతో రాడార్ల ద్వారా సైనికులు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు.
  • రాత్రిపూట చిమ్మచీకట్లోనూ 1.5 నుంచి 3 కి.మీ. దూరం నుంచి ఎవరైనా వెళుతుంటే థర్మల్‌ ఇమేజర్‌ ద్వారా గుర్తించే వ్యవస్థలను సైన్యం ఉపయోగిస్తోంది.
  • వాహనంపై రాడార్‌ సర్వెలెన్స్‌ వ్యవస్థలు ఉన్నాయి. డీఆర్‌డీవో అభివృద్ధిచేసిన దీంట్లో స్కానర్‌, టెలిస్కోప్‌ ఉంటుంది.

మిషన్‌ గన్స్‌...

  • 1.8 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే గన్నులను ప్రదర్శనకు ఉంచారు. మీడియం మిషన్‌ గన్‌ బెల్జియం నుంచి దిగుమతి చేసుకున్నారు.
  • రష్యా తయారీ అయిన 30ఎంఎం ఏజీఎల్‌ సైతం 1.7 కి.మీ. దూరం వరకు లక్ష్యాన్ని గురిపెడుతోంది. 30 కిలోల బరువు ఉంటుంది. నేలపై నుంచి పేల్చాలి.
  • భారత్‌లోనే తయారైన 5.56 ఇన్సాస్‌ ఆర్‌ఐఎఫ్‌ గన్‌ 700 మీటర్ల దూరం లక్ష్యంపై గురిపెట్టొచ్చు.

నేటి సాయంత్రం 4 నుంచి..

1971 యుద్ధ వీరులకు సన్మాన కార్యక్రమం గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఇందుకోసం బుధవారం ఆర్మీ బ్యాండ్‌ ప్రదర్శన, ఆయుధాల ప్రదర్శన, హెలికాప్టర్‌తో రిహార్సల్స్‌ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details