తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్కింగ్​​ చేసిన కారులో 4 కిలోల బంగారం, నగదు - పార్కింగ్​​ చేసిన కారులో 4 కిలోల బంగారం..

పార్కింగ్​ చేసిన కారులో 4 కిలోల బంగారు బిస్కెట్లు, నగదును డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని ఈస్ట్​ మారేడ్​పల్లిలో జరిగింది.

పార్కింగ్​​ చేసిన కారులో 4 కిలోల బంగారం..

By

Published : Nov 23, 2019, 8:48 PM IST

Updated : Nov 23, 2019, 10:13 PM IST

సికింద్రాబాద్​ ఈస్ట్​ మారేడ్​పల్లిలోని ఓ నర్సింగ్​ హోం వద్ద పార్కు చేసిన కారులో 40 బంగారు బిస్కెట్లు, నగదును డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా కోల్​కతా నుంచి మైసూర్​ మీదుగా హైదరాబాద్​కు​ బంగారాన్ని తరలించినట్లు ఒప్పుకున్నారు. పట్టుబడిన నిందితులు మగ్గురు కూడా హైదరాబాద్​కు చెందినవారే.

బంగారాన్ని విదేశాల నుంచి తీసుకొని ఎవరెవరికి విక్రయిస్తున్నారనే దానికి సంబంధించి డీఆర్ఐ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారానికి, నగదుకు ఎలాంటి ధ్రువపత్రాలు లేవని అరెస్ట్ చేసిన ముగ్గురిని విచారిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. బంగారం విలువ కోటి 95 లక్షల రూపాయల వరకు ఉంటుందని.. ఈ పుత్తడి ఎవరికి సంబంధించినదనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

పార్కింగ్​​ చేసిన కారులో 4 కిలోల బంగారం..

ఇదీ చూడండి: ఊహించని మలుపు- మహారాష్ట్రలో భాజపా-ఎన్​సీపీ ప్రభుత్వం

Last Updated : Nov 23, 2019, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details