Two Gold Smugglers Arrested in Shamshabad Airport: కొంతమంది తక్కువ కాలంలోనే ధనవంతుల కావాలనే ఉద్ధేశంతో అక్రమ మార్గాలని అన్వేషిస్తున్నారు. వారి తెలివితేటలను అక్రమంగా రవాణా చేస్తున్న సరుకును పోలీసులకు కనిపెట్టకుండా ఎలా తీసుకెళ్లాలనే ఆలోచిస్తున్నారు. వారు ఆ విధంగా ఆలోచించి ఎంత పని చేయడానికైనా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా హైదరాబాద్లో జరుగుతున్నాయి. విదేశాల నుంచి దొంగ మార్గాల ద్వారా బంగారాన్ని తీసుకువస్తున్నారు. ఈ విషయం కస్టమ్ అధికారులు గుర్తించి వారిని పట్టుకుంటున్నారు. ఇటీవలే నలుగురిని పట్టుకోగా.. తాజాగా మరో ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు.
కస్టమ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. : కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు కస్టమ్ అధికారులకి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిని పరిశీలించగా.. నిందితుడి దగ్గర రూ.72.55లక్షలు విలువైన 1225 గ్రాములు బంగారం ఉందని గుర్తించారు. ఇదే విధంగా మరో వ్యక్తి కువైట్ నుంచి డోహ మీదుగా హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడ్ని అధికారులు పరిశీలించారు. ఆ నిందితుడి దగ్గర రూ.30.51లక్షలు విలువైన 500 గ్రాములు బంగారం గుర్తించి.. పట్టుకున్నారు. ఇద్దరు ప్రయాణికుల దగ్గర నుంచి మొత్తం కోటి రూపాయలు విలువ చేసే 1.725 కిలో గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారి ఇరువురిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.