శంషాబాద్ విమానాశ్రయంలో రూ2.9 కోట్ల విలువైన బంగారం పట్టివేత - gold shamshabad airport
Gold Seize in Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.2.9 కోట్లు విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. మూడు వేరువేరు విమానాల్లో దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Published : Jan 1, 2024, 3:19 PM IST
Gold Seize in Shamshabad Airport :విదేశాల నుంచి బంగారం అక్రమ తరలింపును నివారించడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న స్మగ్లర్లు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ప్రయాణికుల నుంచి రూ.2.9 కోట్లు విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. మూడు వేరువేరు విమానాల్లో దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు.