తెలంగాణ

telangana

ETV Bharat / state

పండుగల వేళ.. పసిడి అమ్మకం వెలవెల - gold buying during Dhanatrayodhasi

వేడుకలు ఏవైనా పసిడి కొనుగోలు భారతీయులకు ఆనవాయితీ. అందులోనూ ధనత్రయోదశికి బంగారం భారీగా కొనుగోలు చేస్తారు. కానీ ధరలు పెరిగినందున... గతేడాది అమ్మకాల్లో 50 శాతం ఉన్నా సంతోషమేనంటున్నారు వ్యాపారులు.

పండుగల వేళ.. పసిడి అమ్మకం వెలవెల

By

Published : Oct 25, 2019, 5:27 AM IST

Updated : Oct 25, 2019, 7:18 AM IST

ఈ ఏడాది ధనత్రయోదశి, దీపావళి పండగలు నగల వ్యాపారులకు కలిసొచ్చేలా లేవు. ప్రజలు కొనుగోలు చేసే తీరు కూడా మారింది. పండగ సమయాల్లో ప్రజలు కొనుగోలు చేయటం తగ్గిపోయిందని వ్యాపారులు అంటున్నారు. గతేడాది ఈ సమయంలో పది గ్రాముల పసిడి విలువ రూ.32వేలు పలికింది. కానీ ప్రస్తుతం దాదాపు 25 శాతం మేర పెరిగి రూ. 40 వేలకు చేరువైంది. ఈ ఏడాది 15 శాతం అమ్మకాలు తగ్గినట్లు విక్రేతలు చెబుతున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం బంగారంపై కస్టమ్స్ సుంకాలను 2.5శాతం పెంచింది. ఇవి చాలవన్నట్టు వాణిజ్య యుద్ధం వల్ల ధరలు భారీగా పెరిగాయి. దీపావళి నాటికి పసడి ధర మరింత తగ్గితే తప్ప కొనుగోళ్లు పెరిగే అవకాశం లేదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

పండుగల వేళ.. పసిడి అమ్మకం వెలవెల
Last Updated : Oct 25, 2019, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details