శంషాబాద్ విమానాశ్రయంలో 725 గ్రాముల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానం రాగా... అధికారులు తనిఖీలు చేశారు. ప్రయాణికుడి వద్ద నల్లటి టేపు చుట్టిన కోడిగుడ్డు ఆకారంలోని మూడు ఉండలు దొరికాయి. మొత్తం 832 గ్రాములు బరువున్న బంగారం ముద్దలను స్వాధీనం చేసుకుని వాటిని కరిగించారు. అందులో ఉంచి వృథా అంతా పోనూ... రూ.27.87లక్షలు విలువైన 725 గ్రాములు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని అధికారులు విచారణ చేపట్టారు.
శంషాబాద్లో 725 గ్రాముల బంగారం స్వాధీనం - శంషాబాద్ విమానాశ్రయం
అక్రమంగా బంగారం తరలిస్తున్న ఓ ప్రయాణికుణ్ని శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి సుమారు రూ.27.87లక్షలు విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
GOLD RECOVERY IN SHAMSHABAD AIRPORT BY DRI OFFICERS