తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాలీ బ్యాగ్​లో సిల్వర్ పూతతో కూడిన బంగారం - gold recovery

శంషాబాద్ విమానాశ్రయంలో ట్రాలీ బ్యాగ్‌లో సిల్వర్‌ పూతతో.. వైర్​లో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

బంగారం స్వాధీనం

By

Published : May 3, 2019, 5:40 AM IST

Updated : May 3, 2019, 9:43 AM IST

శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న ఫిరోజ్‌ఖాన్‌ అనే ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. గురువారం ఉదయం 8.30 గంటలకు దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు ఫిరోజ్‌ బంగారం తీసుకువచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు శంషాబాద్​లో అతనిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. ట్రాలీ​ బ్యాగ్​లో సిల్వర్‌ పూతతో కూడిన పసిడిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కోటింగ్‌తో ఉన్న బంగారం.. వేరు చేసిన తరువాత 1.11 కిలోలు ఉన్నట్లు కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ రవి తెలిపారు.

బంగారం స్వాధీనం
Last Updated : May 3, 2019, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details