గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ 18వ స్నాతకోత్సవాన్ని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వలియతన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశీయంగా వైద్య పరికరాలను ఉత్పత్తి చేసే దిశగా యువ ఇంజినీర్లు ప్రయత్నం చేయాలని సూచించారు. వైద్యరంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త పరిజ్ఞానం వస్తున్నా అది కేవలం 20శాతం ప్రజలకే అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు.
ఆధునిక సాంకేతిక ఫలాలు గ్రామ ప్రజలకు అందాలి - gold medals Cermony in IIIT Hyderabad
ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు కారణమైందని ప్రముఖ వైద్యులు నేషనల్ రిసెర్చ్ ప్రొఫెసర్ ఎంవీఎల్ వలియతన్ పేర్కొన్నారు. నూతన డిజైన్లు చేసే యువ ఇంజినీర్లు దాన్ని పేద ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు.
![ఆధునిక సాంకేతిక ఫలాలు గ్రామ ప్రజలకు అందాలి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4101902-192-4101902-1565458917876.jpg)
ఆధునిక సాంకేతిక ఫలాలు గ్రామ ప్రజలకు అందాలి
ఆధునిక సాంకేతిక ఫలాలు గ్రామ ప్రజలకు అందాలి