GOLD COINS IN OIL PALM PLANTATION: ఆయిల్‌పాం తోటలో తవ్వుతుండగా పురాతన కాలానికి చెందిన 18 బంగారు నాణేలు దొరికిన ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామ పరిధిలో గత నెల 29న ఇవి లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గ్రామంలో మానుకొండ తేజస్వికి చెందిన ఆయిల్‌పాం తోటలో పైపులైన్ కోసం తవ్వుతుండగా బంగారు నాణేలున్న మట్టి పిడత ఒకటి దొరికింది. ఆమె భర్త సత్యనారాయణ ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన తహసీల్దారు పి.నాగమణి.. నాణేలతోపాటు వాటిని ఉంచిన మట్టి పిడతను పరిశీలించారు. ఒక్కో నాణెం సుమారు 8 గ్రాములకు పైగా బరువు ఉన్నాయని నిర్ధారించారు. ఇవి రెండు శతాబ్దాల క్రితం నాటివిగా భావిస్తున్నారు.
మట్టి పిడతలో 18 బంగారు నాణేలు లభ్యం.. ఇది కదా అదృష్టం అంటే! - GOLD COINS IN OIL PALM PLANTATION
GOLD COINS IN OIL PALM PLANTATION: తోటలో పైపులైన్ల కోసం తవ్వుతుండగా మట్టి పిడత లభ్యమైంది. అందులో బంగారు నాణేలు ఉండటం చూసిన ఆ యజమాని ఆశ్చర్యానికి గురైయ్యాడు. ఏపీలోని ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మట్టి పిడతలో బంగారం