రాష్ట్రంలోని వేలాది మంది హస్త కళాకారులను ఆర్థికంగా ఆదుకునేందుకు గోల్కొండ క్రాఫ్ట్ బజార్ ప్రదర్శనలు ఉపయోగపడతాయని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా రామయ్యర్ అన్నారు. కరోనాతో స్వయం ఉపాధి కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నాబార్డు, కేంద్ర జూట్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హస్తకళల ప్రదర్శనను ఛైర్మన్ బొల్లం సంపత్ కుమార్ గుప్తా ప్రారంభించారు
హస్త కళాకారులకు చేయూతనిచ్చే గోల్కొండ క్రాఫ్ట్ బజార్ - గోల్కొండ క్రాఫ్ట్ బజార్ హస్తకళల ప్రదర్శన
కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా చితికిపోయిన హస్త కళాకారులకు చేయూతనిచ్చేందుకు గోల్కొండ క్రాఫ్ట్ బజార్ ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా రామయ్యర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నాబార్డు, కేంద్ర జూట్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హస్తకళల ప్రదర్శనను ఛైర్మన్ బొల్లం సంపత్ కుమార్ గుప్తా ప్రారంభించారు.
హస్తకళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు కళాకారులతో వినియోగదారులకు ప్రత్యక్ష పరిచయం కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని శైలజా రామయ్యర్ వివరించారు. హస్త కళాకారుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు వినియోగదారులు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆమె విన్నవించారు. ప్రభుత్వం సహకారం అందించడంతో పాటు వారి ఆర్థిక అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ సంపత్ కుమార్ గుప్తా తెలిపారు.