గోకుల్ ఛాట్, లుంబినీ పార్కు బాంబు పేలుళ్లు జరిగి 13 ఏళ్లు పూర్తైన సందర్భంగా బాంబు పేలుళ్ల బాధితులు మృతులకు నివాళులు అర్పించారు. పేలుళ్ల ధాటికి గాయపడిన క్షతగాత్రులు అవయవాలు కోల్పోయి నరకయాతన అనుభవిస్తున్నారని, పేలుళ్లు జరిగి పదమూడు సంవత్సరాలు గడచినా బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయలేదని బాధితుడు సయ్యద్ రహీమ్ ఆవేదన వ్యక్తం చేశారు. పేలుళ్లకు పాల్పడిన దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గోకుల్ ఛాట్ పేలుళ్లకు 13 ఏళ్లు.. మృతులకు నివాళులు అర్పించిన బాధితులు! - లుంబినీ పార్క్ బాంబ్ పేలుళ్ల కేసు
గోకుల్ ఛాట్, లుంబినీ పార్కు బాంబు పేలుళ్ల ఘటనలో చనిపోయిన మృతులకు బాధితుడు సయ్యద్ రహీమ్ నివాళులు అర్పించారు. ఘటన జరిగి 13 ఏళ్లు పూర్తైనా.. బాధితులకు ఇంకా న్యాయం చేయలేదని, పేలుళ్ల ధాటికి గాయపడి అవయవాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.
![గోకుల్ ఛాట్ పేలుళ్లకు 13 ఏళ్లు.. మృతులకు నివాళులు అర్పించిన బాధితులు! Gokul Chat Bob blast Victims Pays Tribute to Martyrs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8547027-538-8547027-1598333792909.jpg)
గోకుల్ ఛాట్ ఘటనకు 13 ఏళ్లు.. మృతులకు బాధితుల నివాళులు!