గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం గోదావరి నది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన ఉపసంఘం శుక్రవారం సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా గెజిట్ అమలుపై జీఆర్‌ఎంబీ ఉపసంఘం చర్చించనుంది. ఈ భేటీకి జీఆర్ఎంబీ సభ్యులు, తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరు కానున్నారు.
GRMB: ఈనెల 17న జీఆర్ఎంబీ ఉపసంఘం కీలక భేటీ.. గెజిట్ అమలుపై చర్చ - గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం
18:24 September 15
GRMB:ఈనెల 17న జీఆర్ఎంబీ ఉపసంఘం కీలక భేటీ.. గెజిట్ అమలుపై చర్చ
జీఆర్ఎంబీ సభ్యకార్యదర్శి బీపీ పాండే కన్వీనర్‌గా ఏర్పాటు చేసిన కమిటీలో బోర్డు సభ్యులు ఇద్దరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతర్రాష్ట్రాల వ్యవహారాల చీఫ్ ఇంజినీర్లు సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ, ఏపీ జెన్కో అధికారులు కూడా ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలు కార్యాచరణ, అందుకు సంబంధించిన అంశాలపై ఉపసంఘం సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రాజెక్టుల నిర్వహణా విధానం, ఉద్యోగులు, సిబ్బంది, వనరులు, సీఐఎస్ఎఫ్ భద్రత కోసం వసతి సహా ఇతర క్లాజులపై సమావేశంలో చర్చ జరగనుంది. అందుకు అవసరమైన డాక్యుమెంట్లతో ఉపసంఘం సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్రాల సభ్యులను గోదావరి నదీ యాజమాన్య బోర్డు కోరింది.
ఉపసంఘం ఏర్పాటు
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం ఇదివరకే గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ(KRMB) సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. బోర్డు మీటింగ్ మినిట్స్‌తో పాటు ఉపసంఘాన్ని ప్రకటించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి ఉపసంఘానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై ఉపసంఘం ఎప్పటికప్పుడు చర్చించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి: KRMB AND GRMB MEET: జల్‌శక్తి శాఖతో కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్ల భేటీ