ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునే విషయమై చర్చించేందుకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఇవాళ సమావేశం కానుంది. జీఆర్ఎంబీ సభ్యకార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో వర్చువల్ విధానంలో జరగనున్న సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు పాల్గొంటారు. బోర్డు ఆధీనంలోకి ప్రాజెక్టులను తీసుకునే అంశంపై సమావేశంలో చర్చిస్తారు.
grmb subcommittee meet :నేడు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశం - గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం
గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఇవాళ సమావేశం కానుంది. జీఆర్ఎంబీ సభ్యకార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో వర్చువల్ విధానంలో జరగనున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు పాల్గొంటారు. బోర్డు ఆధీనంలోకి ప్రాజెక్టులను తీసుకునే విషయమై సమావేశంలో చర్చిస్తారు.
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ ఆనకట్ట, దేవాదుల ఎత్తిపోతల పథకం, ఆంధ్రప్రదేశ్లోని సీలేరు సహా ఇతర కాంపోనెంట్ల స్వాధీనం విషయమై సమాలోచనలు చేస్తారు. అటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బృందం ఈనెల 26, 27 తేదీల్లో జూరాల, ఆర్డీఎస్, సుంకేశుల ప్రాజెక్టులను సందర్శించనుంది. ఆర్డీఎస్ నుంచి తగిన నీరు రావడం లేదని పూర్తి స్థాయిలో వచ్చేలా చూడాలన్న తెలంగాణ విజ్ఞప్తి నేపథ్యంలో కేఆర్ఎంబీ బృందం పర్యటించనుంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టులను కూడా బృందం పరిశీలించనుంది.